5 వ పల్లె ప్రగతి కార్యక్రమానికి ముందస్తు సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీపీ

Published: Tuesday May 31, 2022

అశ్వారావుపేట( ప్రజాపాలన ప్రతినిధి) సోమవారం రోజు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అశ్వారావుపేట మండల సర్పంచ్ లు, సెక్రెటరీ గార్లతో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్యక్షతన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరావు  తలపెట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం గురుంచి, అలాగే ప్రతి గ్రామంలో విద్యార్థులు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఏర్పాటు కొరకు ముందస్తు గా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి  మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన హారిత హారం, పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం ఇలా ప్రతి పల్లే పచ్చగా వుండాలనే ఉద్దేశంతో మన గ్రామాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం, అలాగే మన మండలంలో మొత్తం 75 క్రీడా మైదానాలు సెలెక్ట్ అయ్యాయని వాటిని కేటాయించిన ప్రదేశాలలో త్వరగా పూర్తీ చేయాలనీ, అలానే ఈ సారి కూడా అలాగే పల్లె ప్రగతి కార్యక్రమన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో నే నంబర్ వన్ స్థానం మన మండలానికి వచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడి మంచి పేరు తేవాలని,మన గ్రామాలలో వున్న సమస్యలను గుర్తించి వెంటనే సంబధిత అధికారులకు తెలియజేయాలని, అలాగే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని గ్రామాలలో వున్న సమస్యలను తీర్చే విధంగా ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి  కోరారు.ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, సర్పంచ్ లు,యండీఓ విద్యాధర రావు,యంపీఒ సీత రామరాజు,యంఆర్వో చల్లా ప్రసాద్, సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు.