పాలేరు లో ఘనంగా రాహుల్ గాంధీ 52వ జన్మదిన వేడుకలు

Published: Monday June 20, 2022
పాలేరు జూన్ 19 ప్రజాపాలన ప్రతినిధి
 పాలేరు నియోజకవర్గం  నేలకొండపల్లి మండల పోట్టిశ్రీరాములు సెంటర్ నందు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు  ఆదేశాలు మేరకు  మన ప్రియతమ నాయకుడు, ఏ ఐ సి సి మాజీ అధ్యక్షుడు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి 52వ జన్మదిన వేడుకలు  పాలేరు నియోజక వర్గం సేవాదళ్ కన్వీనర్ బచ్చలకురి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కొరట్లగూడెం ఎంపీటీసీ రేగురి వాసవి,మరియు నేలకొండపల్లి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు దోసపాటి శేఖర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేషికేశ్,జిల్లా BC సెల్ కాంగ్రెస్డ్ నాయకులు బోయిన వేణు,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ,నేలకొండపల్లి మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు