సాగర్ రహదారి మాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ప్రమాదాలు అరికట్టే విధంగా బ్రేకర్లు నియమించాలి

Published: Monday May 30, 2022

యాచారం: మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు సాగర్ ప్రధాన రహదారిపై ముఖ్యమైన మలుపు వద్ద రోడ్డు సరిగా లేకపోవడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,శుక్రవారం కూడా ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అందువల్ల తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి  రోడ్డు మరమ్మతులు చేపట్టాలని శనివారం యాచారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టారు.రాస్తారోకో కారణంగా సుమారు  గంటపాటు వాహనాలు నిలిచిపోవడం జరిగింది.అనంతరం యాచారం పోలీసుల జోక్యంతో బిజెపి శ్రేణులు రాస్తారోకో విరమించారు.బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ ఈ మలుపు వద్ద  హెజ్ఎండబ్ల్యుఎస్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు అడ్డగోలుగా తవ్వకాలు జరిపి, పెద్ద గోతులు చేసి వదిలి పెట్టడం జరిగిందని,ఇంకా  రోడ్లు భవనాల శాఖ వేసిన రోడ్డు కూడా సరైన నాణ్యత లేక వర్షాలకు తెగిపోవడం,గుంతలా మాయంగా మారిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదంలో పలువురు యువకులు,పసి పిల్లలు చనిపోవడం జరిగిందని,కావున  ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని,బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వెంటనే రోడ్డు మరమ్మత్తులకు చేపట్టకపోతే, సంబంధిత   కార్యాలయాలను ముట్టడిస్తామని  హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్,కిసాన్ మోర్చా జాతీయ  మాజి కార్యవర్గ సభ్యులు బోజి రెడ్డి,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు  గొల్ల పల్లి శ్రీధర్ గౌడ్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం, ఉపాధ్యక్షులు పత్తి రాజు, ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సంగేమ్ శ్రీనాథ్,బిజెపి నాయకులు సభవత్ గణేష్,గుడాల వెంకటేష్,బూత్ అధ్యక్షులు రవీందర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు