భారీ వర్షాలకు దెబ్బతిన్న వర్ష కొండా పెద్ద చెరువు కట్ట

Published: Friday July 15, 2022
ఇబ్రహీంపట్నం , జూలై 14 (ప్రజాపాలన ప్రతినిధి ):
మండలంలోని వర్షకొండ గ్రామంలోని పెద్ద చెరువు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షలతో నిండు కుండలమారి  కట్టతెగే ప్రమాదం అంచుకు చేరడంతో వెంటనే అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మత్తడిని జేసీబీ సహాయంతో గండికొట్టారు,దీనితో గ్రామానికి పెద్ద ప్రమాదం తప్పిందిని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు  అయితే మిషన్ కాకతీయ ద్వారా మొరం పోసిన కట్టకు ఇన్సైడ్  రాయి పెట్టక పోవడం వలన ఇట్టి ప్రమాదం తలెతిందని గ్రామస్తులు తెలిపారు ఇకనైనా చెరువు కట్టాను  బాగుచేయాలనీ ప్రజలందరూ  కోరుకుంటున్నారు అనంతరం ఎమ్మార్వో ఉమామహేశ్వర్ పరిశీలించారు  కార్యక్రమంలో సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం, ఆర్ ఐ భూమేష్, ఏఈ సుకన్య, వీఆర్వో రాకేష్, వీఆర్ఏ ప్రేమ్, కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పొనుకంటి చిన్న వెంకట్, మార్కెట్ కమిటీ మెంబర్ దోమకొండ చిన్న రాజన్న, జంగా విజయ్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు