బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేర్ల మురళీధర్

Published: Friday December 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 01ప్రజాపాలన, ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన సెర్ల మురళీధర్ ను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. నా మీద నమ్మకముతో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఈ బాధ్యత మరింత పెరిగిందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకంతో ఇచ్చిన  జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు, గుచ్చుల ప్రేమేందర్ రెడ్డి లకు, సెర్ల మురళీధర్ కృతజ్ఞతలు తెలిపారు.