రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. సీపీఎం

Published: Wednesday December 28, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి: నాల్గు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా పనులు చేయటం వల్ల, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వెంటనే సరైన పద్ధతిలో రోడ్లను వేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని సోమగూడెం ఎక్స్ రోడ్డు వద్ద అఖిలపక్షం నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
 
ఈ సందర్భంగా పలువు నాయకులు మాట్లాడారు,
సోమగూడెం ఎక్స్ రోడ్డు వద్ద ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు లేకుండా, జీబ్రా గుర్తులు వెయ్యకుండా, రోడ్లు ప్రమాదకరంగా మారాయనీ,  అదేవిధంగా కాసిపేటకు వెళ్లే మార్గంలో భూగర్భ కాలువ నిర్మాణం చేసి రోడ్డు వేయకుండా వదిలేయడం వల్ల, భారీ గుంతలు ఏర్పడి, రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. చుట్టుపక్కల ఉన్న హోటల్లు,షాపుల  చిరు వ్యాపారులు దుమ్ము, ధూళితో వ్యాపారాలు కొనసాగించుకోలేకపోతున్నారనీ, రోడ్డు పక్కనే ఉన్న ఆటో స్టాండ్ లోని ఆటో డ్రైవర్లకు,ప్రయాణికులకు రాళ్లు వచ్చి తాకి గాయాలవుతున్నాయనీ,  ఆటోలు దెబ్బతింటున్నాయనీ.  బస్టాండ్ లోని  ప్రయాణికులు దుమ్ము, ధూళితో అనారోగ్యాల పాలవుతున్నారనీ అన్నారు.
తన సొంత లాభం కోసం ప్రజల ప్రాణాలతో  కాంట్రాక్టర్, నేషనల్ హైవే అధికారులు చెలగాటమాడుతున్నారనీ. హైవే నుంచి వంద మీటర్ల దూరం దాకా కాసిపపేట వరకు రోడ్డు వేయవలసి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వేయ లేదనీ, వెంటనే రోడ్డు నిర్మించాలని, ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు వేసి జీబ్రా గుర్తులు వేయాలని డిమాండ్ చేశారు. 
 ఈ రెండు రోజుల్లో పనులు పూర్తిగా కాకపోతే 30వ తేదీన భారీ ఎత్తున రాస్తారోకో చేయడం జరుగుతుందనీ వారు హెచ్చరించారు. 
స్థానిక ఎస్సై గంగారం  రాస్తారోకో  ప్రాంతానికి  వచ్చి ఆందోళన కారుల తో , జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి   రాస్తారోకోని విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, జిల్లా కమిటీ సభ్యు దూలం శ్రీనివాస్,  ఉపసర్పంచ్ కనుక రాకేష్, నాయకులు అజ్మీర రాజ,
చిలుముల శ్రీనివాస్,
ఎనగందుల వినోద్,
జంజిరాల రాజు,
కనుకుల యశ్వంత్, బిఆర్ఎస్ నాయకులు కొండ బత్తుల రామచందర్, ఎంపీటీసీ,
సపాట్ శంకర్, సర్పంచ్,
కాంగ్రెస్ నాయకులు దూడ మహేష్,
ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్,
గోపాల్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.