అధికారులు ప్రజల కోసం పని చేశాలి* జడ్పీ చైర్మన్ కమల్ రాజు*

Published: Tuesday December 13, 2022

మధిర  డిసెంబర్ 12 (ప్రజా పాలన ప్రతినిధి) అధికారులు ప్రజల కోసం పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సూచించారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు లింగాల కమల్ రాజుని కలసి వివిధ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండు కళ్ళుగా భావించి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తుందన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు, రైతు బీమా పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి పది వేలు రూపాయలు అందిస్తున్నారన్నారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు వివాహం చేసే సమయంలో లక్ష 116 రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా అందిస్తున్నారని ఆయన తెలిపారు. వృద్ధుల ఆసరా కోసం ఆసరా పెన్షన్లు తదితర అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారని ఆయన తెలిపారు.