ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి *మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమం కోస

Published: Tuesday November 15, 2022

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య వృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమం  అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సర  బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని,చేప పిల్లలకు బదులుగా సోసైటిల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయాలని ఈనెల నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాము, సదస్సుకు జాతీయ నాయకులు ప్రజ సంఘాల నాయకులు హాజరవుతున్నారు.
ఈ రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా పోస్టర్ ఆవిష్కరణ  చేయడం జరిగింది.అనంతరం  అయిన మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పెన్షన్ ప్రతినెల 5 వేల రూపాయలు ఇవ్వాలని, రెండో విడతగా ఎన్సిడిసి ద్వారా 34 రకాల సంక్షేమ పథకాలు అందించాలని ప్రతీ నియోజకవర్గం కేంద్రంలో వోల్ సెల్,రీటైల్ చేపల మార్కెట్లు 50 లక్షల రూ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సదస్సులో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలియజేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులు ముఠ విజయ్ జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు సి హెచ్ వెంకన్న, పూలగాజుల జంగయ్య ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు రావణమోని రాజు, మంచాల మండలం ప్రధాన కార్యదర్శి బోద్రమోని నర్సింహ్మా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నాయకులు చనమోని గోపాల్, యాట బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.