కొన్నేళ్లుగా జ్ఞాపకాలను సజీవంగా ఉంచేది ఫోటోనే

Published: Friday August 20, 2021
వికారాబాద్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్ల రమేష్
వికారాబాద్ బ్యూరో 19 ఆగస్ట్ ప్రజాపాలన : ప్రపంచ అందాలను చూడటానికి ఫోటోలు ఉత్తమ మార్గమని వికారాబాద్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్ల రమేష్ అన్నారు. కొన్నేళ్లుగా జ్ఞాపకాలను సజీవంగా ఉంచేది ఫోటోలేనని పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని యెన్నేపల్లిలోని శివసాయి బోర్ వెల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటో దినోత్సవాన్ని డిఎస్పి సంజీవరావు, న్యాయవాది కోకట్ మాధవరెడ్డి శివసాయి బోర్ వెల్స్ వ్యవస్థాపకులు పాశం కృష్ణారెడ్డి, డి.రవిల ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీని తమ కెరీర్ గా కొనసాగించుటకు ప్రపంచవ్యాప్త ఫోటో గ్రాఫర్లను ఏకం చేయడానికి మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో నిర్వహిస్తారని వివరించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం క్షణాలు ఆలోచనలను గ్రహించడానికి ఉపయోగపడుతుందని గుర్తుచేశారు. సృజనాత్మకతకు సాంకేతిక పరిజ్ఞానం పరిణామమే కెమెరాను పట్టుకునేలా చేసిందని చెప్పారు. అనంతరం రక్తదానం, పండ్లు పంపిణీ, కొంపల్లి సమీపంలో ఉన్న అనాథ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, కోశాధికారి కె.భూపాల్, గౌరవ అధ్యక్షుడు డి.నర్సిములు, సభ్యులు శేఖర్, హీరా‌లాల్, ఎం.గోపాల్, ఎం.రాజు, రాజలింగం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.