మెప్మా లో భారీ కుంభకోణం సంఘం లీడర్ ఆర్పీ బ్యాంక్ ఉద్యోగులు కలిసి భారీ స్కాం

Published: Wednesday January 04, 2023

కోరుట్ల, జనవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ లో భారీ అవినీతి కుంభకోణంలో మున్సిపల్ అధికారులు సుమారు రెండు కోట్ల పైబడి మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మున్సిపల్ అధికారుల భారీ అవినీతి కుంభకోణం లో బడా బాబుల హస్తం ఉంది అని బిజెపి కౌన్సిలర్ మాడవేణి నరేష్ ఆరోపించారు. అనంతరం మాడవేణి నరేష్ మాట్లాడుతూ గత కొన్ని నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా కొన్ని బ్యాంకుల సహాయ సహకారాలతో మహిళా సంఘాలకు రుణాలు ఇప్పిస్తా అని సాకుతో కోరుట్ల పట్టణంలో ఉన్న ప్రముఖ బడా బాబుల సహాయ సహకారాలతో మున్సిపల్ మెట్మా అధికారుల సూచనలతో మహిళా సంఘాల ఆర్ పి లను ముందుంచి బడా మోసానికి తెరతీశారు గత మూడు నెలల నుంచి జోరుగా ఈ దందా జరుగుతుంది దాదాపుగా 10 మంది ఉన్న మహిళా సంఘానికి 13 లక్షల రూపాయలు వారికి మంజూరు అయినట్టు బ్యాంక్ అధికారులకు చూయించి కొంతమంది బాధితులకు మాత్రం 5 లక్షల రూపాయలతో తల 50 వేల రూపాయలు ఇచ్చి మిగతా ఎనిమిది లక్షల రూపాయలు వారి సొంత అవసరాలకు వాడుకున్నట్టు పూర్తి సమాచారం ఉంది మరికొంతమందికి సంఘాలకు 13 లక్షలు మంజూరు అయిన మీకు పైనుంచి ఇంకా లోన్ రాలేదని వారిని మభ్యపెట్టి భారీ మోసానికి తెర లేపారు ఇదేమి అని నిలదీసిన వారికి రెండు నెలల్లో మీ డబ్బులు మీకు ఇస్తామని పేపర్ రాసి ఇచ్చినట్టు అంతర్గత సమాచారం ఉంది, కింది స్థాయి అమాయక మహిళలను ఏజెంట్లు గా ఏర్పాటు చేసుకొని డబ్బులు ఎక్కువగా అవసరం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసి ఈ మోసానికి తెరలేపారు. ఎవరెవరైతే ఇందులో మోసపోయారో ధైర్యంగా బయటకు వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మాడవేణి నరేష్ బాధితుల పక్షాన నిరంతరం పోరాడుతాడని తెలుపుతున్నాను , వెంటనే దీనిపై లోతుగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసి పూర్తి డబ్బులను రికవరీ చేయాలని మాడవేణి నరేష్ డిమాండ్ చేశారు.