ఆసుపత్రిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయండి బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్

Published: Friday December 23, 2022

 

జన్నారం, డిసెంబర్ 22, ప్రజాపాలన: మండల ప్రాథమిక ఆసుపత్రిలో సిబ్బందిని కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు ములుగు ప్రవీణ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆసుపత్రి చేస్తా జిల్లా ఆరోగ్య కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మండలంలోని 29 గ్రామపంచాయతీలో ప్రజలే కాకుండా కడెం మండలం ఉట్నూర్ పైపు పొడుంపూర్ ఎక్కువమంది గిరిజనులు గిరిజేతాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనితో ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీలను భర్తీ చేయాలని ఆయన అన్నాడు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ప్రత్యేక కేంద్రం ఉందన్నారు. దానికి సరిపడా డాక్టర్లు సరిపోవడం లేదన్నారు. ఈ ఆసుపత్రి ట్రైబల్ ఏరియా విజ్ఞానిక దూరంగా ఉందన్నారు. ఈ మండలంలో 34 గ్రామాల ప్రజలు ఈ ఆస్పత్రికి రావడం జరుగుతుందన్నారు. అందులో ఎక్కువగా ఆదివాసులు లంబాడీలు నివాసముండి ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారన్నారు. వీరు పేదలు వీరందరికీ వైద్యం అందించవలసి ఉంటుందన్నారు. సీజనల్ సమయంలో పడకలు లేక ఒకే బెడ్ పై ఇద్దరు రోగులు పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ఆస్పత్రిలో దుర్భరమైన పరిస్థితి నెలకొందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు సరియైన సమయంలో ఉండడం లేదన్నారు. ఈ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యాన్ని ఉచితంగా అందించవలసి చెప్పడమే గాని ఇక్కడ ఉన్న పేదలకు వైద్యం అందడం లేదన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి చేయాలని హామీ ఇచ్చిన ఇంతవరకు నిర్మించడం జరుగుతలేదన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే 30 పడగల ఆసుపత్రి నిర్మించాలని ఆయన కోరారు.జన్నారం, డిసెంబర్ 22, ప్రజాపాలన: మండల ప్రాథమిక ఆసుపత్రిలో సిబ్బందిని కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు ములుగు ప్రవీణ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆసుపత్రి చేస్తా జిల్లా ఆరోగ్య కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మండలంలోని 29 గ్రామపంచాయతీలో ప్రజలే కాకుండా కడెం మండలం ఉట్నూర్ పైపు పొడుంపూర్ ఎక్కువమంది గిరిజనులు గిరిజేతాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనితో ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీలను భర్తీ చేయాలని ఆయన అన్నాడు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ప్రత్యేక కేంద్రం ఉందన్నారు. దానికి సరిపడా డాక్టర్లు సరిపోవడం లేదన్నారు. ఈ ఆసుపత్రి ట్రైబల్ ఏరియా విజ్ఞానిక దూరంగా ఉందన్నారు. ఈ మండలంలో 34 గ్రామాల ప్రజలు ఈ ఆస్పత్రికి రావడం జరుగుతుందన్నారు. అందులో ఎక్కువగా ఆదివాసులు లంబాడీలు నివాసముండి ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారన్నారు. వీరు పేదలు వీరందరికీ వైద్యం అందించవలసి ఉంటుందన్నారు. సీజనల్ సమయంలో పడకలు లేక ఒకే బెడ్ పై ఇద్దరు రోగులు పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ఆస్పత్రిలో దుర్భరమైన పరిస్థితి నెలకొందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు సరియైన సమయంలో ఉండడం లేదన్నారు. ఈ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యాన్ని ఉచితంగా అందించవలసి చెప్పడమే గాని ఇక్కడ ఉన్న పేదలకు వైద్యం అందడం లేదన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి చేయాలని హామీ ఇచ్చిన ఇంతవరకు నిర్మించడం జరుగుతలేదన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే 30 పడగల ఆసుపత్రి నిర్మించాలని ఆయన కోరారు.