పేదల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో

Published: Tuesday May 17, 2022
దళితుల అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ కన్న కలలు  నిజం కావాలి 
 
 దళిత బంధు పథకంతో పదిమందికి ఉపాధి కల్పించేలా దళితులు ఎదగాలి 
 
గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు భూమి పూజ చేసిన మంత్రి 
 
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
 
                    000000
దళిత బంధు పథకముతో తమ కాళ్ళపై తాము నిలబడేడమే కాకుండా  పది మందికి ఉపాధి కల్పించేలా ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
 
సోమవారం నగరంలోని  గీతాభవన్ దగ్గర వడ్లూరి శ్రావణ్ శ్రీ లక్ష్మి మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీస్ షాపును, కాడె రాజశేఖర్ సుభాష్ నగర వద్ద ఎస్.కె.లైటింగ్ అండ్ టెంట్ హౌజ్, గసికంటి అరుణ్ కుమార్ గాంధీరోడ్ వద్ద వాయుపుత్ర ఎలక్ట్రికల్స్  దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందిన 3యూనిట్లను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం దళితుల కండ్లలలో ఆనందం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు  దళిత బంధు పథకం అమలు చేస్తుందని అన్నారు.  దళిత బంధు ద్వారా మంజూరైన యూనిట్లను సక్రమంగా నడిపించుకుంటూ ఆర్థికాభివృద్ది సాధించాలని అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల ఆర్థికాభిఫృద్ది సాధనపై కన్న కలలు నిజమవుతాయని అన్నారు.  ఈ సందర్భంగా దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందిన వారిని మంత్రి యూనిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
 వడ్లూరి శ్రావణ్ మాట్లాడుతూ  దళిత బంధు పథకం మంజూరు కాకముందు మొబైల్స్ రిపేర్లు చేసుకుంటూ చాలీచాలని డబ్బుతో  పూట గడవకుండా ఎన్నో రోజులు పస్తులు ఉండేవాడినని, దళిత బంధు పథకం మంజూరైనందుకు సొంతంగా మొబైల్ షాప్ కు యాజమాని  అవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
 
దళిత పథకం ద్వారా లబ్దిపొందిన  ఎస్.కె.లైటింగ్ అండ్ టెంట్ హౌజ్ యజమాని కాడె రాజ శేఖర్ మాట్లాడుతూ తాను గతంలో టెంట్ హౌజ్ సామాన్లు అద్దెకు తెచ్చుకుని వచ్చిన లాభంలో  90 శాతం అద్దె చెల్లించి, కేవలం మిగిలిన 10 శాతంతోనే కాలం వెళ్లదీసే వాడినని, ఇప్పుడు నూటికి నూరు శాతం లాభం పొందుటకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని  అన్నారు. 
 
గసికంటి అరుణ్ కుమార్  గతంలో బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేస్తూ చాలి చాలని లాభంతో కుటుంబాన్ని పోషించేవాడినని, ఇప్పుడు నేను దళిత బంధు పథకం మంజూరు ద్వారా వాయుపుత్ర ఎలక్ట్రికల్స్ షాపుకు యజమానిగా మారారని సంతోషం వ్యక్తం చేశారు. 
 
అంతకుముందు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నగరంలోని పద్మనగర్ లో  గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు భూమి పూజ, శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాలు, గిరిజన, మైనారిటీ అల్పసంఖ్యాకులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జిల్లాలో గిరిజన మహిళలు వేరే ప్రాంతం నుండి వలస ద్వారా ఇక్కడికి వచ్చి  జీవనోపాధి గడుపుతున్న వారికి వసతి కల్పించాలనే ఉద్దేశ్యంతో 2 కోట్ల 75 లక్షల వ్యయంతో వంద మంది బస చేయుటకు వీలు కల్పిస్తూ నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ వసతి గృహం ఒక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. అదే విధంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చేస్తున్న గిరిజన విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని తెలిపారు.
 
 
 ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పోరేటర్లు, సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు. 
 
  సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది