శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం

Published: Monday April 11, 2022
మధిర ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి మండల మున్సిపాలిటీ పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా మండల పరిధిలో మున్సిపాల్టీలో ఆదివారం నాడు అనేక దేవాలయాల్లో రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం భక్తుల మధ్య రాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అనేక దేవాలయాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ భక్తులచే అభినందనలు తెలుపుతూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు  మున్సిపాలిటీ పరిధిలో రెండో భద్రాచలంగా పిలువబడుతున్న రామాలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ దాతల సహకారంతో మహా అన్నదానం కార్యక్రమం సందర్భం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్ల పొత్తు నరసింహారావు కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అధ్యక్షులు కపిల్ వాయి జగన్ మోహన్ రావు రుహ, నల్లగుండ వంశీ, దొడ్డ మురళి, వేముల తిరుపతిరావు, వేములపల్లి విశ్వనాథం, దొడ్డ శ్రీనివాసరావు, కుంచెం కృష్ణారావు, పెరుమల్ల సత్యనారాయణరావు, ఆలగడ్డ నరసింహారావు, ఆవుల రామకృష్ణ, వెంకటేశ్వరరావు. అనంతరం లడక బజారులో దేశభక్తి యువజన ఆధ్వర్యంలో రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా మండలం పరిధిలో దేశినేని పాలెం దెందుకూరు సిద్దినేని గూడెం అనేక గ్రామాలు రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అదే విధంగా గ్రామాల్లో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగినట్లు భక్తులు తెలిపారు