నీట మునిగిన కాలనీలలో పర్యటించిన అడిషినల్ కలెక్టర్ మేయర్ డిప్యూటీ మేయర్

Published: Friday July 16, 2021
మేడిపల్లి, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో గత రాత్రి కురిసిన వర్షం కారణంగా నీట మునిగిన 1వ డివిజన్లోని అయోధ్య కాలనీ, సుమ రెసిడెన్సి, ప్రగతి నగర్ మరియు 5, 7 డివిజన్లలోని పలు కాలనీలలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ సామ్సన్, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమీషనర్ శ్రీనివాస్, డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో నీటి నిలువను తగ్గించడానికి అదేవిదంగా ఎగువనున్న ప్రాంతాలనుంచి వచ్చే వర్షపు నీటి ప్రవాహాన్ని మళ్ళించడానికి తీసుకుంటున్న చర్యలను మేయర్ జక్క వెంకట్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ కు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితిలో స్థానిక కార్పొరేటర్ కు లేదా  మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని కోరారు. నీటి నిలువ ఎక్కువగా ఉన్న కాలనీలలో ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేసామని నీటిని జేసిబిలతో దారి మళ్ళించే ప్రక్రియ కొనగిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ దైర్యంగా ఉండాలని ప్రభుత్వం నుండి కావలిన పూర్తీ సహాయ, సహకారాలు అందించే విదంగా కృషి చేస్తామని అడిషినల్ కలెక్టర్ జాన్ సామ్సన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎస్తేర్ అనిత, కార్పొరేటర్ బొడిగే స్వాతి, నాయకులు మాడగుల చంద్రా రెడ్డి, బొడిగే కృష్ణ గౌడ్, నిర్మల, జావీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.