ఉమ్మనేని సేవ ఫౌండేషన్, సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎస్.కె మౌలాలికి సహకారం

Published: Wednesday March 29, 2023

బోనకల్,28 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన ఎస్.కె మౌలాలి అలియాస్( వెంకయ్యకు) అతను వెన్నుపూస దెబ్బ తినడం వల్ల రెండు కాళ్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఉమ్మనేని లక్ష్మీనారాయణ వెంకట్రావుల సేవ ఫౌండేషన్ ఫౌండర్ సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ సెక్రెటరీ దామా స్వరూప కి సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఉమ్మనేని రవి కళ్యాణపు బుచ్చయ్య వల్లంకొండ సురేష్ కలిసి విషయం తెలియజేయగా వెంటనే స్పందించి ఖమ్మం మమత హాస్పిటల్ లో నెల రోజులపాటు వైద్యం చేపించేందుకు హాస్పటల్ కు తీసుకెళ్లడం జరిగింది.ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో సిపిఎం గ్రామ శాఖ, ఉమ్మనేని ఫౌండేషన్ సేవ ద్వారా కొంత ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా మంగళవారం మమత హాస్పిటల్ నుంచి డిశ్చార్జిఐ మౌలాలి తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంగా సత్యసాయి ధాన్య మండలి శాఖ సెక్రెటరీ సభ్యులతో కలిసి నిత్యవసర సరుకులు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌలాలి ఆలియాస్ వెంకయ్య మాట్లాడుతూ నాకు ఇంత సహకారం అందించిన ఉమ్మినేని సేవ ఫౌండేషన్ ఫౌండర్ సత్యసాయి ధాన్య మండల శాఖ సెక్రెటరీ దామా స్వరూప వారి సభ్యులు,సిపిఎం పార్టీ గ్రామ శాఖ వారికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కమిటీ సభ్యులు సేవా ఫౌండేషన్ ఫౌండర్, సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ సెక్రెటరీ దామా స్వరూప మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.