దళితులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ పై నిరసన ** కెవిపిఎస్ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాల దగ్ధం **

Published: Friday February 03, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 02 (ప్రజాపాలన,ప్రతినిధి) : దళితులకు బిజెపి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లొ చేసిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిజెపి ద్రోహపూరిత చర్యకు నిరసనగా గురువారం జిల్లా కేంద్రంలో బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాడి మల్లయ్య, దుర్గం దినకర్ లు మాట్లాడుతూ దేశంలో దళితులు 20 శాతం ఉండగా కేంద్ర బిజెపి సర్కార్ దళితులకు 16 శాతం నిధులు మాత్రమే కేటాయించి, అవి కూడా సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. గత బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి రూ 89400 లు, కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ 60000 కోట్లకు తగ్గించి దళితులకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన బడ్జెట్లో కేంద్రం తీవ్రమైన కోత విధించి వివక్ష పాటించిందన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి, ఇండ్ల స్థలాలు, ఇండ్లు,వంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని, 2014 నుండి 8 ఏళ్ల కాలంలో దళితులపై సామాజికంగా దాడులు దౌర్జన్యాలు పెరుగుతుంటే ఈ 2023 బడ్జెట్ లొ ఆర్థిక అణిచివేతకు వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ద్రోహం చేసిన తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బడ్జెట్ పత్రాల దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, కెవిపిఎస్ నాయకులు మహేష్, ప్రసాద్,గణేష్, తదితరులు పాల్గొన్నారు.