టీ.బీసి జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆకునూరి శంకరయ్య

Published: Saturday March 13, 2021

జగిత్యాల మార్చి 12 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ బీసీ జేఏసి రాష్ర్ట ఉపాధ్యక్షునిగా హైదరాబాద్ నివాసి అయిన ఆకునూరి శంకరయ్యను నియమించినట్లు టీ.బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ప్రకటించారు. శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా టీ.బీసీ జేఏసి కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి విజయ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్ సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుకు దేశంలోని బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో బీసీలకు పెద్దపీటవేసి అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు. దేశ ప్రధానమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న మోదీ బీసీ కావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసి ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ జిల్లా యువజన ఉపాధ్యక్షుడు కూసరి అనిల్ మహిళా జేఏసి జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి గౌరవ అధ్యక్షురాలు సింగం లత విద్యార్థి జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధోనూరి భూమ చారి నాయకులు సుధాకర్ కార్తిక్ ఆంజనేయులు, రాష్ట్ర జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.