వడగండ్ల భీభత్సం..కుదేలైన మామిడి రైతు

Published: Tuesday May 04, 2021
ఉక్కపోతతో అల్లాడిన జనం
బలమైన ఈదురు గాలులు వడగండ్లతో వర్షం
అకాల వర్షంతో పీకల్లోతు అప్పులోకి మామిడి రైతు
వికారాబాద్ మే 3 ప్రజాపాలన బ్యూరో : ఉక్కపోతతో అల్లాడిన జనం. విద్యుత్ అంతరాయంతో వృద్ధులు, చిన్నారులకు కష్టాల కడలి. సోమవారం 4 గంటల వరకు ఎండ వేడిమితో తల్లడిల్లిన జనాలు అకాల వర్షంతో సేదతీరిన ప్రజలు. సుమారు 4 గంటల సమయంలో ఈదురు గాలులు, వడగండ్లతో వరుణదేవుని ప్రతాపం ప్రారంభం అయ్యింది. వరుణుని ప్రతాపానికి చెట్లు, విద్యుత్ స్థంభాలు, మామిడి కాయలు భూమాత ఒడిలో వాలాయి. ఇండ్ల పై రేకులు, రేకుల షెడ్లు, మామిడి తోటలపై వాయుదేవుని తీవ్ర ప్రభావంతో నష్టాల ఊబిలోకి ఇంటి యజమానులు, మామిడి రైతులు. వర్షం పడటం వలన సంతోషించాలో ఏడవాలో దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు. అప్పులు తెచ్చి మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు. పూత కాత బాగా కాయడంతో అప్పుల ఊబిలోంచి గట్టెక్క వచ్చని గంపెడాశ పెట్టుకున్నారు. కానీ, తాను ఒకటి తలచుకుంటే దైవం మరొకటి తలచినట్లుంది సోమవారం నాటి అకాల వర్షంతో.