పనులలో నాణ్యతను పాటించాలి

Published: Friday April 16, 2021
కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్
మేడిపల్లి, ఏప్రిల్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కమ్యూనిటీ హాల్ మరియు షెడ్ నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటించాలని చిలుకా నగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కాంట్రాక్టర్ కు సూచించారు. చిల్కానగర్ డివిజన్ లోని ఈస్ట్ కళ్యాణపూరిలో కమ్యూనిటీ హాల్ మరియు షెడ్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈస్ట్ కళ్యాణపూరి మొదటి అంతస్తు కమ్యూనిటీ హాల్ మరియు షెడ్ నిర్మాణ పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు. కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యమైన స్టీల్ ని  మరియు సిమెంట్ వాడాలని, ప్రతి విషయంలో నాణ్యతను పాటించాలని, నిర్ణీత సమయం వరకు వాటర్ క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు టిఆర్ఎస్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, అబ్బా బాయ్, కొకొండ జగన్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, మహమూద్, బీరప్పగడ్డ బాలు, బంటి  తదితరులు పాల్గొన్నారు.