భూర్గంపహాడ్ మండలం బి. ఆర్. స్ పార్టీ ఎస్సి సెల్ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశ లో పాల్గొన్న ప

Published: Friday November 18, 2022
భూర్గంపహాడ్ మండలం బి. ఆర్. స్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు వలదాసు సాలయ్య  అధ్యక్షతన..!ఈ రోజు బూర్గంపాడు మండలం  బి.అర్.యస్ పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన బూర్గంపాడు మండల ఎస్సి సెల్ కార్య వర్గ సమావేశంలో ముఖ్య అతిధిలుగా పినపాక నియోజకవర్గం బి. ఆర్. స్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  భూర్గంపహాడ్ మండలం బి. ఆర్. స్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి  & పినపాక నియోజకవర్గం బి. ఆర్. స్ పార్టీ పరిశీలుకులు తడికమళ్ళ ప్రభుదాస్  పాల్గొన్నారు. .అదేవిధంగా పినపాక నియోజక వర్గం ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికై  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది అనీ అన్నారు , దళిత బంధు పథకం మీద వస్తున్న వార్తలను నమ్మవద్దు అనీ, ఈ పధకం 7సంవత్సరాల ప్రోగ్రామ్ అని దళిత కుటుంబాలు అందరికి ఈ పధకం అందుతుందని అన్నారు,  పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ :శ్రీ  రేగా కాంతారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి గ్రామాలలో ప్రజలకు తెలియజేసే బాధ్యత కమిటీ వారిదే  ఆని అన్నారు.

ఈ సమావేశంలో మండల బి ఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి దాసరి కాంతారావు , మాజి జెడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు, భూర్గంపహాడ్ మండలం సోషల్ మీడియా అధ్యక్షులు గంగపురి చంద్రశేఖర్,అశ్వాపురం మండలం బి. ఆర్. స్ పార్టీ ఎస్సి ప్రధానకార్యదర్శి వల్లెపోగు రాము, శంకర్ మరియు భూర్గంపహాడ్ మండల ఎస్సి సెల్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.