ధరల పెంపునకు నిరసనగా మార్చి 31 ఏప్రిల్ 5న ఆందోళనలు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీ

Published: Thursday March 31, 2022

రాయికల్, మార్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి): నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం తోనే ప్రజలపై పన్నుల భారం పడుతుందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు రాయికల్ పట్టణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో  ఏ నాడు రైతులకు ఇబ్బంది కలిగించే లేమని కేంద్రాన్ని సమన్వయం చేసుకొని ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల దేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ స్థలాలను వేలం వేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాలు కనుమరుగయ్యే పరిస్థితులు వస్తాయని వాపోయారు .కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని నేడు ప్రతి గ్రామపంచాయతీలో జరిగే అభివృద్ధి పనులు హరితహారం, వైకుంఠ దా మాలు, డంపింగ్ యార్డులు, పల్లె  ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు పేదలకు కూలి పని ఉపాధి హామీ నిధులే దిక్కున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పన్ను భారాన్ని ప్రజలపై మోపకుండా పన్ను భారాన్ని ప్రభుత్వాలు భరించాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిత్యావసర ధరలను తగ్గించి విద్యుత్తు చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని ఈనెల మార్చి 31న మండల కేంద్రంలో, ఏప్రిల్ 5న నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు తెలుపుతామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాణహిత నది జలాలను తుమ్మిడిహట్టి నుండి చేవెళ్ల వరకూ 16 లక్షల ఎకరాలకు సాగునీరు హైదరాబాదుకు త్రాగు నీరు, పరిశ్రమలకు నీటి సౌకర్యం కల్పించేందుకు 40 వేల కోట్లతో రూపకల్పన చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం నూతన ప్రాజెక్టులు చేపట్టవద్దని ఆంక్షలు ఉండటంతో వాటిని పునరావృతం చేసి రూ.లక్షా ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మించారని పేర్కొన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములనిఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజా రెడ్డి, రాయికల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు. కె.రవీందర్ రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ కె.మహిపాల్ రెడ్డి, ఎద్దండి దివాకర్ రెడ్డి, బాపు రపు నరసయ్య, బత్తిని భూమయ్య, షాకీర్ లక్ష్మీనారాయణ, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.