పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Thursday July 28, 2022
మేడిపల్లి, జూలై27 (ప్రజాపాలన ప్రతిని)
లాభ పేక్ష లేకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి వరంగల్ హైవే ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన పరమిత ఆస్పత్రి 5వ శాఖను బుధవారం నాడు డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలకు,               చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అత్యాధునిక సదుపాయాలు  అనుభవం కలిగిన స్త్రీ వైద్య నిపుణులు, చిన్నపిల్లల జబ్బుల పట్ల అనుభవం కల్గిన వైద్యులతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా "పరమిత" ఉమెన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ " 5వ శాఖను 62బెడ్స్,24గంటల అత్యవసర సదుపాయంతో అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు చైర్మన్ డాక్టర్. ధనరాజ్, డైరెక్టర్ శ్రీ హరీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, అనంత రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, హరిశంకర్ రెడ్డి,బచ్చ రాజు, సింగిరెడ్డి పద్మారెడ్డి, సుమన్ నాయక్,నాయకులు పప్పుల అంజిరెడ్డి, బండారి రవీందర్, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, డాక్టర్లు శ్రీ విద్యా, సునీత ప్రదీప్, అవినాష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.