ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Saturday September 17, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 16 ( ప్రజాపాలన ప్రతినిధి): ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 8 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో  సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీనీ ముఖ్యమంత్రి చేపట్టారు అని అన్నారు. చరిత్రలో ఎన్నడూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది చెక్కులు పంపిణీ చేయటం జరగలేదని అన్నారు. నిన్న ఉదయం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నీ సందర్శించగా వైద్యులు, స్టాఫ్ నర్సులు అందరూ అందుబాటు లో ఉన్నారని మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని అన్నారు.  టి ఆర్ నగర్ లో 8 వేల జనాభా కు బస్తీ దవాఖాన ఏర్పాటు చేయగా రోజు 200 మంది కి ఉపయోగకరంగా ఉందని, ఇస్లాం పుర లో సైతం ఏర్పాటు చేశామని, త్వరలోనే లింగం పెట్ కి బస్తీ దవాఖాన మంజూరు చేయబోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, పిఎసిఎస్  ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ చాంద్ పాషా, సర్పంచ్ లు చెరుకు జాన్, బోనాగిరి నారాయణ, ప్రకాష్, ఎంపీటీసీ లు మందుల శ్రీనివాస్, భూపెల్లి శ్రీనివాస్, ఎస్టీ సెల్ శ్రీరామ్ బిక్ష పతి, ఉప సర్పంచ్ వెంకటేష్,నాయకులు అంకం సతీష్, చదువుల కోటేష్, రాజేందర్, ఎల్ల రాజన్న, నాడెం శంకర్, కోలాగాని సత్యం, కుడుకల లక్ష్మణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.