ఆసరా పెన్షన్లు అత్యధికంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

Published: Tuesday September 27, 2022

మధిర  సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి దేశంలో  అత్యధికంగా అసరా పెన్షన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో 20 మరియు 21 వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన నిరుపేదలకు 2016 రూపాయల ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వృద్ధాప్యంలో పని చేయలేని పరిస్థితిలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉండేందుకు నెల నెల 2016 రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టిఆర్ఎస్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక కమిషనర్ అంబటి రమాదేవి వార్డు కౌన్సిలర్లు ఎర్రగుంట లక్ష్మి ధీరవద్ మాధవి వైవి అప్పారావు ప్యారి మున్సిపల్ సిబ్బంది ఆర్పి లు లబ్ధిదారులు  పాల్గొన్నారు.