మలబార్ వేప విత్తనాలు పంపిణీ : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Friday December 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజాపాలన : మలబార్, వేప విత్తనాలు పంపిణీ చేశామని ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ మర్పల్లి కార్యాలయంలో కార్యదర్శులకు, సాంకేతిక సహాయకులకు సమావేశ మందిరంలో సమావేశము ఏర్పాటు చేయనైనది. ఈ సందర్భంగా ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ మాట్లాడుతూ ఇంకా నర్సరీలో సీడ్ విత్తనాలు తీసుకోని గ్రామాల కార్యదర్శులు ఈరోజు తీసుకోవాలని సూచించారు. రిజెక్ట్ అయిన కూలీల ఖాతా నంబర్లు సరైనవి ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాగ్ ఫిల్లింగ్ మాస్టర్స్ పేమెంట్ చేయించాలని వివరించారు. మలబార్ వేప విత్తనాలు 24 గ్రామాలకు పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. రేపటి నుండి వన సేవకుల చేత సీడ్ ఫిల్లింగ్ చేయించే విధంగా గైడ్ చేయాలని చెప్పారు. సోమవారం పనికి వెళ్లే కూలీలకు డిమాండ్ పెట్టాలని అన్నారు. గ్రామసభల  తీర్మానాలు ఇవ్వని కార్యదర్శులు ఈరోజు సమావేశంలో ఇవ్వాలని కార్యదర్శులకు అదేశించారు. గ్రామంలో స్సెంట్రల్ టీమ్ మన జిల్లాకు మండలానికి 4 గ్రామాల చొప్పున విజిట్ చేయనున్నారు. కంపోస్టు షెడ్ల నిర్వహణ తడి చెత్త పొడి చెత్త వేరు చేయుట వంటి వాటిని పరిశీలిస్తారు. గ్రామాలలో బోర్డు రాసి పెట్టుట చెత్త ట్రాక్టర్ యందు వేసేటప్పుడు ట్రాక్టర్ మధ్యలో రేకు పెట్టి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకోవాలని తెలిపారు. ఐహెచ్ హెచ్ ఎల్ వాడుతున్న విధానము గ్రామంలో అడిగి తెలుసుకుంటారు. అందరూ వాడే విధంగా చర్య తీసికోవాలి. మురుగు కాల్వలు రోడ్లు శుభ్రంగా ఉంచాలి. వారు వచ్చినపుడు గ్రామాలు శుభ్రంగా కనిపించాలి. సెంట్రల్ టీమ్ వచ్చినపుడు ఖచ్చితముగా కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్ తప్పని సరిగా గ్రాంలోనే ఉండాలి. ఎవరైనా అనుమతి లేనిది గైర్హాజర్ అయితే  చర్య తీసుకోబడునని ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో ఎపిఓ అంజి రెడ్డి టెక్నికల్ అసిస్టెంట్లు కార్యదర్శులు పాల్గునారు.