మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్

Published: Thursday June 23, 2022

మధిర జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ సందర్శించి
పెండింగ్‌ కేసులపై దృష్టి సారించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అధికారులకు సూచించారు. తనిఖీల్లో భాగంగా  పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఆయన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు.కేసులకు సంబంధించి ఛార్జ్‌షీట్‌లు త్వరగా కోర్టుకు సమర్పించి బాధితులకు త్వరితగతిన  న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.  కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. 
పోలీస్​ స్టేషన్​ పరిసరాలు, స్టేషన్​ నిర్వహణ, పోలీసుల పనితీరు, రికార్డులను పోలీస్ కమిషనర్  పరిశీలించారు. కేసుల వివరాలు, పోలీస్ స్టేషన్ లో 14 ఫంక్షనల్ వర్టికల్స్ పనివిధానాన్ని పరిశీలించారు.నేరాల నియంత్రణ , సీసీ కెమెరాల ఏర్పాటు అదేవిధంగా  చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా స్దానిక యువతకు  కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సి ఏ  ఓ మురళి. ఎస్ ఐ సిబ్బంది పాల్గొన్నారు