హబ్సిగూడ మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూంలో వజ్రాభరణాల ప్రదర్శన మేడిపల్లి, ఫిబ్రవరి 24 (ప్రజాపాల

Published: Saturday February 25, 2023
 ప్రపంచంలో అతి పెద్ద జువెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ తమ హబ్సిగూడ షోరూంలో  మైన్ డైమండ్స్ ప్రదర్శనతో పాటు షోరూంలో ప్రతేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు.ఈ డైమండ్ షోని ముఖ్య అతిధులుగా వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మరియు మలబార్ గోల్డ్ & డైమండ్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చి సొంతం చేసుకొనే విధంగా కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ హబ్సిగూడ షోరూంలో ఫిబ్రవరి 25, 2023 నుండి మార్చి 06 వరకు, 2023 ఈ డైమండ్ షో కొనసాగుతుంది అని షోరూం హెడ్ అహ్మద్ సోఫీ తెలిపారు.మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తమ వినియోగదారులకు 10 నాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటపుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడి పై శూన్య తగ్గింపు. నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మారుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిరహించిన ఐజిఐ మరియు జిఐఎ ధృవీకరించిన వజ్రాభరణాలు, బై బ్యాక్ గ్యారెంటీ, తనిఖీ చేయడానికి కారైట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్ననమకమైన జువెలరీ బ్రాండ్, మలబార్ గ్రూప్ కి సంబందించిన మూలమైన సంస్థ, ఈ సంస్థ తమ వార్షిక ఆదాయంలో నుంచి గణనీయమైన వాటిని సామజిక సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగం, ఉచిత విద్య నిరుపేదలకు గృహ నిరాణం మహిళా సాధికారిత, ఇంకా పర్యావరణ రక్షణ విభాగాలలో తమవంతు సాయం అందిస్తుంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆభరణాల విక్రయ వారంలో ఒక ప్రత్యేకత ఏర్పచుకుంటూ ఇండియా, సింగపూర్, జీసీసీ, యూ ఎస్ ఎ దేశాలలో 300 కి పైగా షోరూములతో విస్తరించుకొని ముందుకు సాగుతుంది అని స్టోర్ హెడ్ అహ్మద్ సోఫీ  వివరించారు.