సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నటువంటి భారీ కేట్లను తొలగించాలి ----ఎండి ఖయ్యాం పాష

Published: Monday November 14, 2022
చౌటుప్పల్, నవంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారి మీద తంగడిపల్లి రోడ్డు వద్ద ఉన్న క్రాసింగ్ దగ్గర ఏర్పాటుచేసిన భారీ కేట్లను తొలగించాలని డివైఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ కేట్ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ సిఐ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖయ్యూం పాష మాట్లాడుతూ చౌటుప్పల్ నుండి తంగడపల్లి నారాయణపురం మునుగోడు చండూరు మండలాలకి వెళ్లడానికి ఏకైక మార్గంలో భారీ కేట్లని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అదేవిధంగా మున్సిపల్ కేంద్రంలోని రోడ్డు అవతలి భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కి మరియు చిన్న పిల్లల హాస్పిటల్స్ కి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని అన్నారు, తక్షణమే చర్చలు తీసుకొని భారీ కేట్లని తొలగించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీశైలం, గోశిక కర్ణాకర్, గోపగోని లక్ష్మణ్, బోయ యాదయ్య, ఎర్ర ఉషయ్య, దేప రాజు, తదితరులు పాల్గొన్నారు