నల్లగట్ల సాయిప్రణీత్ సేవలు అభినందనీయం

Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోటీరటిఆర్ఎస్ మధిర యూత్ నాయకులు నల్లగట్ల సాయి ప్రణీత్ సేవలు అభినందనీయమని, మాటూరు పేట వైద్యాధికారి వెంకటేష్, మధిర మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి పేర్కొన్నారు. మధిర సిపిఎస్ పాఠశాలలో కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి నల్లగట్ల సాయి ప్రణీత్ ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ వెంకటేష్, కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిన వారందరికీ వాటర్ బాటిల్స్ అందజేసిన సాయి ప్రణీత్ ను వారు అభినందించారు.