ఘనంగా డాక్టర్ గురువారెడ్డి జన్మదిన వేడుకలు

Published: Friday February 12, 2021
కొండాపూర్ లెజెండ్ యువజన సంఘం
 
వెల్గటూర్, మార్చ్ 11 (ప్రజాపాలన) జగిత్యాల ప్రముఖ వైద్యులు డాక్టర్ గురువారెడ్డి జన్మదిన వేడుకలను వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామం లో లెజెండ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ గురువారెడ్డి స్వగ్రామమైన కొండాపూర్ లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పదిరె నారాయణ రావు స్వామివారి శేష వస్త్రాంతొ ఘనంగా సన్మానించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదము  విచారణ చేసి ఆశీర్వచనం చేసినారు. లెజెండ్ యువజన సంఘం ఆధ్వర్యంలో 53 వ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి  శాలువాలతో పూలమాలలతో డాక్టర్ గురువారెడ్డి నీ సన్మానించిజన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, డి. రాజా రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటస్వామి లెజెండ్ యువజన సంఘం అధ్యక్షులు మన్నె జితేందర్, కార్యదర్శి గుమ్మడి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, శ్రీధర్, గుమ్మడి రాజశేఖర్, చెల్లి పవన్, సురేష్, గుమ్మడి నవీన్, శివ, రూపేష్, గుమ్మడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Attachments area