ఘనంగా(BRS) భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సంబరాలు..

Published: Thursday October 06, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కూడలిలో నందు సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీ ప్రకటించబోతున్న నేపథ్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు,బ్యాండ్ మేళాలు పెట్టుకొని ఘనంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో
జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించబోతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అన్నారు, ఈనెల 5వ తేదీన అనగా ఈ రోజు సీఎం కేసీఆర్  జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించబోతున్న నేపథ్యంలో ఈ అంశం దేశంలోనే చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఈ ప్రకటన కోసం ప్రజలు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు అన్నారు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశస్థాయిలో కూడా అమలయ్యే అవకాశం ఉందని అన్నారు, దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారన్నారు. దేశం బాగుపడాలంటే సీఎం కేసీఆర్  లాంటి నాయకుడు ద్వారానే సాధ్యమవుతుందని మేధావి వర్గం కూడా కెసిఆర్  స్వాగతిస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, రైతులకు  24 గంటలు ఉచిత కరెంటు వంటి పథకాలు కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో అనేక సంక్షేమ పథకాల తో తెలంగాణ అద్భుత ఫలితాలను సాధించిందని అన్నారు . అంతేకాకుండా దేశంలో ఎక్కడ చూసినా మత రాజకీయాలు బడుగు బలహీన వర్గాలపైన అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే కెసిఆర్ లాంటి ముందుచూపు విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరమని వారు ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో కేసీఆర్ సంచలన సృష్టించబోతున్నారని యువత రైతులు మొత్తం కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,. మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,. వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోడియం నరేంద్ర, సారపాక టౌన్ ప్రెసిడెంట్ శీను, టిఆర్ఎస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోట, ఏసోబు, బాలు శ్రీహరి, గోనే దారోగా మండల నాయకులు యువజన నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.