బాలాజీ ఎస్టేట్ అధ్వర్యంలో ప్యాడ్స్ పంపిణీ..

Published: Tuesday February 14, 2023
తల్లాడ, ఫిబ్రవరి 13 (ప్రజా పాలన న్యూస్): 
శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఖమ్మం వారి సహకారంతో తల్లాడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు
పరీక్ష ప్యాడ్లు వితరణ
శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్ ఖమ్మం వారి సహకారంతో తల్లాడ మండలంలోని తల్లాడ, అన్నారుగూడెం, కొన్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సోమవారం మోటివేషన్ తరగతులు నిర్వహించారు.
ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేషనల్ స్పీకర్ ఎండి నవాబ్ పాషా తో విద్యార్థులకు అవసరమైన స్టడీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్, గోల్ సెట్టింగ్స్, టైం మేనేజ్మెంట్, తదితర అంశాలపై బోధించి విద్యార్థులకు మంచి మార్కులు సాధించుట మరియు పలు సూచనలు చేశారు, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందజేశారు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలాజీ ఎస్టేట్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.