ఎర్రవల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ

Published: Thursday September 29, 2022
సర్పంచ్ మల్లమ్మ హనుమంతు
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజా పాలన : బతుకమ్మ దసరా ఉత్సవాలను నూతన వస్త్రాలను ధరించి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ మల్లమ్మ హనుమంత్ ఆకాంక్షించారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను వికారాబాద్ మండల ఉపాధ్యక్షుడు గఫార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు గఫార్ మాట్లాడుతూ అప్పట్లో భూస్వాములు మహిళలను ఆడపిల్లలను చిత్రహింసలకు గురి చేసే వారని స్పష్టం చేశారు. మహిళలు ఆడపిల్లలు కష్టాల కడలిని పోరాడి ఎదిరించి బతుకు అనే కారణంతో బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకునే వారని గుర్తు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు బతుకమ్మ ఉత్సవాలను ప్రతి గ్రామంలో మహిళలందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు. మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ నాల్గవ రోజు నాన బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మలుగా తొమ్మిది రోజులు జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ బీసీ అధ్యక్షుడు నర్సింలు ఏఎన్ఎం టీచర్ సువర్ణ గ్రామస్తులు భీమయ్య ఎల్లయ్య అంజయ్య డీలర్ అశోక్ రవీందర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area