అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ప్రవేశాల కోసం విద్యార్థుల సందడి

Published: Wednesday November 16, 2022

హైదరాబాద్ 15 నవంబర్ ప్రజాపాలన: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ పిజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో విద్యార్థులు ఈ విధంగా సందడి చేశారు.

నవంబర్ 15 అడ్మీషన్ చివరి రోజు కావడంతో అంబేడ్కర్ యునివర్సిటీ లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులతో సందడి ఏర్పడింది. దరఖాస్తులను నింపడం సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌంటర్ లో కాలేజీ ఫీజు చెల్లించేందుకు  ఉదయం నుండి విద్యార్థులు బారులు తీరారు.