సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు

Published: Friday September 17, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం యాచారం మండల పరిధిలోని మంతన్ గౌరెల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి మధుసూదన్ రెడ్డి  హాజరై సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ నైజాం దుర్మార్గులను ఎదిరించి పోరాడే 10 లక్షల భూమిని పంచింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే అని అన్నారు. పోరాట దళాలు 3వేల గ్రామాలను దొరల దోపిడీ  పాలననుండీ విముక్తి చేశి గ్రామ స్వరాజ్యం స్థాపించాయని అన్నారు. దొరల దాష్టికానుండీ వేలకొద్దీ గడీలు నేల కూలాయని అన్నారు. నాడు వేల టన్నుల ధాన్యం, దొరల ధాన్యాగారాలనుండి తీసి పేదలకు పంచారని ,నీ బాంచన్‌ (నీ బానిసను) దొరా, నీ కాల్మొక్కుతా దొరా అన్న తెలంగాణ పేద పుత్రుని చేత ఆపోరాటం గుతప పట్టించింది. గునపం పట్టించింది. బందూకు (తుపాకీ) కూడా పట్టించింది. వంగిన ఆ నడుమును లేపి నిలబెట్టి వీరుణ్ణి చేసింది. చివరకు ఆ వీరపుత్రునిచేత మరఫిరంగి మోత మోగింప చేసిందా పోరాటమనీ అన్నారు. నాలుగువేల మంది ఎర్రజండా బిడ్డలు, ఆ నైజాం, భూస్వామ్య సైన్యాన్ని, రజాకారు ముష్కరులను, పటేల్‌ సైన్యాన్ని ఎదిరించి పోరాడి, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. ఆ పోరాటం గురించి ప్లాను వేసిన వాళ్ళల్లో, రాత రాసిన వాళ్ళల్లో, పాట పాడిన వాళ్ళల్లో, తుపాకి పట్టిన వాళ్ళల్లో, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళల్లో, ప్రాణాలు తీసిన వాళ్ళల్లో, ప్రాణాలిచ్చిన వాళ్ళల్లో, సకలకులాల వాళ్ళున్నారు. సకల మతాల వాళ్ళూ ఉన్నారనీ ఆయన  అన్నారు. ఆ పోరాట వారసత్వం నేడు పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాణాలపైన బడా పెట్టుబడి దారులకు విధెశి స్వదేశి దోపిడిదారులకు జాతి సంపద దోచి పెడుతున్న విదానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చందు నాయక్, సిపిఎం శాఖ కార్యదర్శి గ్రామ ఉపసర్పంచ్ రమేష్ నాయక్, సిపిఎం పార్టీ నాయకులు జంగారెడ్డి, భజన లాల్, రమేష్, గణేష్, సాయి కుమార్ ,కిట్టు, మనోహర్, ఉమర్ ఖాన్, కుమార్, వినోద్, ధర్మ, గణేష్, శ్రీకాంత్, బాలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు