తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలి. ప్రజాపాలన అక్టోబర్27, శ్రీరాంపూర్:

Published: Friday October 28, 2022

 సింగరేణి ఉద్యోగులు విధులకు హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ,హెల్మెట్ తప్పకుండా ధరించాలని బెల్లంపల్లి రీజియన్ రక్షణ జి ఎం. జాన్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని చెక్ పోస్ట్ వద్ద హెల్మెట్ ధరించడం సీటు బెల్ట్ పెట్టుకోవడం పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఇంటి నుంచి బయలుదేరినప్పటినుండే రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రహదారి భద్రత నియమాలను పాటించకుండా పోషకుడు రోడ్డు ప్రమాదానికి గురైతే ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ఆహార అలవాట్లలో మార్పు చేసుకోవాలని పేర్కొన్నారు. మద్యం సేవించి విధులకు హాజరు కావద్దని దీనివల్ల వారు చేసే పనిలో ఇతరులకు ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందన్నారు. హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తూ సింగరేణి కార్మికులు సింగరేణిలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే న్యూ టెక్ గని సంక్షేమ అధికారి పాల్ సృజన్, టీబీజీకేఎస్ నాయకులు బుస్స రమేష్ ,తిరుపతిరెడ్డి, ఇంజనీర్ రాజగోపాల చారి, ఇంజనీర్ కృష్ణ, డిప్యూటీ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కారులో వచ్చే  ఉద్యోగులు