జిల్లాకు అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి దించిన సేవలు అభినందనీయం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప

Published: Monday June 20, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 19(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాకు అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా వరుణ్ రెడ్డి పదోన్నతి పై వెళుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడుకోలు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, రాజేశం, జిల్లా  అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో కేబీ జిల్లా కు అవార్డు రావడంలో వరుణ్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి ప్రజలలో మమేకమై అనేక సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని అన్నారు. జిల్లాలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పనిచేశారని, అదే తరహాలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గా ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
"నూతనంగా జిల్లాలో అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయి" అదే తరహాలో సేవలు అందించాలని కోరారు. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఆసిఫాబాద్ లో విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాను, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మరింతగా ఆకర్షించాయని తెలిపారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ లో  గిరిజనులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కేబీ ఆసిఫాబాద్ జిల్లా ను మరచిపోని, జిల్లాలోని అధికార యంత్రాంగం తన విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో సహకారం అందించారని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో రాజన్య మండల అధికారి దత్తు, ఈ శాఖల  అధికారులు తదితరులు పాల్గొన్నారు