నియోజకవర్గంలోని ప్రజలందరికీ కరోనా టీకా : ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Thursday June 24, 2021
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కరోనా టీకా ఇప్పించేందుకు ప్రతి డివిజన్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రజలకు సౌలభ్యం కోసం అదనంగా ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ డివిజన్ జె. ఎస్ .ఎన్. నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్, చిల్కానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మరియు కాప్రా మున్సిపల్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ ఫేస్ వన్ ప్లేగ్రౌండ్ ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్, నాచారంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్, కాప్రా డివిజన్లోని సాయిబాబా గుడి ఆవరణంలో అదనంగా వ్యాక్సినేషన్ కేంద్రాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 30 సంవత్సరాల పైబడిన వారు అందరూ టీకాలు తీసుకోవచ్చు అని తెలిపారు. టీకా వేసే ప్రదేశాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సౌందర్యలత, వైద్య సూపర్వైజర్ భోగా ప్రకాష్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు శంకర్, అరుణకుమారిి, ఈ.ఈ. నాగేందర్, డి.ఈ.నాగమణి, రూప, ఏ.ఎం. ఓహెచ్. మైత్రేయి డాక్టర్ స్వర్ణలత, కార్పొరేటర్లు చేతన హరీష్, జెర్రిపోతుల ప్రభుదాస్, శాంతి సాయి జైన్ శేఖర్, స్వర్ణ రాజు, టీఆర్ఎస్ నాయకులు వనం పల్లి గోపాల్ రెడ్డి, గరికె సుధాకర్, పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, నంది కంటి శివ, వైద్య, మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.