హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి..

Published: Wednesday July 20, 2022
 ఖమ్మం, జూలై 19 (ప్రజాపాలన న్యూస్): 
జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా  ఆధ్వర్యంలో మంగళవారం కూసుమంచి మండలం జుజ్జులరావుపేట, పెరికాసింగారం,   కూసుమంచి గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలు,  హరితహారం, కోవిడ్  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎస్ఎస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ  ఆరోగ్యాంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని తొలగించాలని సూచించారు. యువత ఉద్వోగం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడాలనుకునే వారు ఎప్పడికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరాక్చుకొని అంది వచ్చే అవకాశాలను వినియోగించుకొవాలన్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న మహిళలు, యువతీ, యువకులు, అన్ని వర్గాల ప్రజలందరు ఈ శిక్షణ లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం శక్తితో ప్రతివారు ఎదగాలని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో వృద్ధి సాధించి దేశపురోభివృద్ధికి దోహద పడాలని కోరారు. ఈ కరోనా సమయం లో అందరు అప్రమత్తంగా ఉండి పేస్ మాస్కులు, శానిటైజర్ వాడాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.