అన్నపూర్ణ అదృశ్యం కేసు చేధిస్తాం – ప్రత్యేక బృందాలతో ముమ్మర విచారణ – వికారాబాద్‌ జిల్లా ఎస్

Published: Wednesday June 29, 2022

వికారాబాద్‌ బ్యూరో జూన్ ప్రజాపాలన : వికారాబాద్‌ జిల్లాలో సంచలనంగా మారిన తాండూరుకు చెందిన సత్యమూర్తి భార్య అన్నపూర్ణ అదృశ్యం కేసును వదిలిపెట్టేది లేదని, ఖచ్చితంగా ఆమెను కనిపెట్టి తీరుతామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. అన్నపూర్ణ కేసును చేధించాలంటూ పోలీసులకు 48 గంటల గడువు ఇచ్చి పిల్లలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యమూర్తి, అతని పిల్లలను వారణాసిలో గుర్తించిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వికారాబాద్‌కు తీసుకవచ్చిన సత్యమూర్తిని ఎస్పీ కోటిరెడ్డి సమక్షంలో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ భార్య అదృశ్యం కేసును చేధించలేదనే మనస్థాపంతో సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ఈ సంఘటన సంచలనంగా మారడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సత్యమూర్తిని పట్టుకున్నట్లు వెల్లడించారు. సీసీ పుటేజీల ఆధారంగా పరిగి మీదుగా వెళ్లి శంషాబాద్‌ ఏయిర్ పోర్టు నుంచి ముంబై, అటునుంచి వారణాసి వెల్లినట్లు గుర్తించామన్నారు. తిరిగి వచ్చిన సత్యమూర్తికి కౌన్సిలింగ్ ఇచ్చి మనోధైర్యం కల్పించడం జరుగుతుందన్నారు.

 

అన్నపూర్ణ కేసులో ముమ్మర విచారణ
జిల్లాలో గత మూడేళ్లుగా 450 మిస్సింగ్ కేసులు నమోదైలే అందులో 425 కేసులను చేధించడం జరిగిందని ఎస్పీ కోటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో దాదాపు 25 కేసులు మాత్రలే ఎలాంటి అధారాలు లేకపోవడంతో పురోగతిని సాధించలేకపోయామన్నారు. అందులో అన్నపూర్ణ కేసు కూడ ఉందని అన్నారు. అన్నపూర్ణ మిన్సింగ్ కేసులో లీకైన్ ఆడియోలో మల్లికార్జున్‌ను సంబాషణతో పాటు సత్యమూర్తి అందించిన ఆధారాలతో అన్నపూర్ణ కేసును చేధిస్తామన్నారు. సత్యమూర్తిని 48 గంటలల్లో గుర్తించిన విధంగానే అన్నపూర్ణ కేసును వదిలిపెట్టుకుంటా ఆమె ఆచూకీని కనిపెట్టి తీరుతామన్నారు. ఈలోగా అన్నపూర్ణ తనంతకు తానుగా తిరిగివస్తే సంతోషమన్నారు. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసు కోసం అడిషనల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌, ఐటీ బృందాలతో పాటు స్థానిక పోలీసుల బృందాలతో విచారణ ముమ్మరం చేస్తామన్నారు. మరోవైపు కుటుంబాలలో అందరు బందాలకు విలువ ఇవ్వాలని,కుటుంభ సభ్యులను బాధపెట్టే విధంగా ఎవ్వరు చెప్పకుండా అదృశ్యం కావొద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ సిఐలు రాజేందర్ రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.