వికలాంగుల హక్కుల పోరాట సమితి(వి హెచ్ పి ఏస్) ఆవిర్భావ దినోత్సవ ఘనంగా జరిపారు

Published: Monday August 29, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి.

ఆదివారం రోజున ఇబ్రాహింపట్నం పట్టణ  కేంద్రములో మండల అధ్యక్షులు గువ్వల యాదయ్య అద్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి హెచ్ పి ఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ 2007 అగస్టు 28న మందక్రిష్ణ మాదిగ  నాయకత్వంలో ఏర్పడింది.  వి హెచ్ పి ఏస్ ఎర్పడ్డ తరువాత వికలాంగులకు గుర్తింపు,గౌరవ పెరిగిందని తెలిపారు.వికలాంగుల పించన్  రూ 200 నుండి 3016 తీసుకుంటున్నామంటే మందక్రిష్ణ మాదిగ,వి హెచ్ పి ఏస్ పోరాట పలితమే తెలిపారు వికలాంగుల సమస్యలపై నిరంతరంగా పోరాడుతున్న ఏకైక సంఘం వి హెచ్ పి ఏస్ నే అని తెలిపారు.  అదేవిధంగా వికలాంగులకు మండల కేంద్రములో 50 లక్షల నిదులతో వికలాంగుల సమావేశ హాల్,మరియు ప్రతి గ్రామములో వికలాంగుల భవనాలకు 10లక్షల నిదులతో నిర్మిచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమములో వి హెచ్ పి ఏస్ జిల్లా నాయకులు యాచారం జంగయ్య,వరికుప్పల వెంకటేష్, యాచారం సత్యనారయణ,కందుకూరి నాగరాజు, బోజ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area