విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించిన విద్యార్థి సంఘం నాయకుడు శంకరపట్నం జనవరి 11 ప్రజ

Published: Thursday January 12, 2023

శంకరపట్నం మండలంలో ఎమ్మెల్యే తొలిపొద్దు పర్యటన సందర్భంగా బుధవారము విద్యార్థి సంఘ నాయకుడు  ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్ మండలంలోని వివిధ పాఠశాలల, విద్యార్థుల సమస్యలపై  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి వినతి పత్రం సమర్పించాడు. ఈ సందర్భంగా కనకం సాగర్ వివిధ పాఠశాలల సమస్యలను ఎమ్మెల్యే కి వివరిస్తూ..శంకరపట్నం మండల కేంద్రం లో గల ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద కుంటలో మురికి నీరు నిల్వ వుండి అందులో నుండి దుర్గంధం వస్తుందని, అంతే కాకుండా దోమలు ఈగలు వాలి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సాగర్ తెలియజేసారు. శంకరపట్నం మండల కేంద్రంలో సుమారు 25 గ్రామాల నిరుపేద విద్యార్థులు పదవతరగతి ఆపైచదువులకు దూర ప్రాంతాలకు వెళ్లవలసివస్తుందని, బస్సులు సరిగా అందుబాటలో లేక విద్యార్థులు ఇబ్బందులు పడవలసి వస్తుంది కావున ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మిచి నిరుపేద విద్యార్థులు అద్యున్నతికి తోడ్పాడాలని, శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ లేక అనేక అసంఘిక వ్యవహారాలు జరుగుతున్నాయి కావున పక్క ప్రహరీ గోడ నిర్మించాలని ఎమ్మెల్యే కి వివరించారు.
దీనికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు కనకం సాగర్  తెలియజేశారు