ఆళ్లపాడులో రాజకీయాలలో పెనుమార్పు

Published: Monday May 02, 2022
మధిర మే 1 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో బోనకల్ మండలం ఆర్ల పాడు గ్రామంలో శనివారం రాత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఆశయాలు ఆయన కూతురు షర్మిల స్థాపించిన వైయస్సార్ తెలంగాణ పార్టీతోనే సాధ్యం ప్రగతిశీల మార్పుకోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో కలిసిరావాలని ప్రజలకు పిలుపు - మధిర నియోజకవర్గంలో జరగబోయే షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలిత్వరలో గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు వైయస్సార్తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల కే కే డి ప్రకటన బోనకల్ మండలం ఆళ్లపాడులో రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొత్తగా స్థాపించిన వైయస్సా పార్టీలో పలుకుటుంబాలు చేరాయి. నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల కే కే డి ఆధ్వర్యంలో ప్రధానంగా సీపీఎం,కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలనుండి ఆళ్లపాడు,రాయన్నపేటకు చెందిన పలువురు స్వచ్చందంగా పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కందుల వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కే కే డి మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆనాడు రైతులు, రైతు కూలీలు, మహిళలు ప్రతిఒక్కరూ సంతోషంతో ఉన్నారని నాటి రాజన్న రాజ్యం మరలా తీసుకువచ్చేందుకు ఆయన కూతురు స్థాపించిన పార్టీలోకి స్వచ్చందంగా రావాలని పిలుపునిచ్చారు. త్వరలో మధిర నియోజకవర్గంలో జరిగే షర్మిల పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. గ్రామంలో త్వరలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇరుగు జ్ఞానేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మర్రి ప్రేమ్ కుమార్, మండల యూత్ అధ్యక్షుడు మంద నాగరాజు, మధిర మండల నాయకుడు దేవంబట్ల శ్రీనివాస్ శాస్త్రి, రాయన్నపేట గ్రామశాఖ అధ్యక్షుడు వెదుళ్ల గోపి తదితరులు పాల్గొన్నారు.