గంగమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గోన్న మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి

Published: Saturday July 23, 2022

జగిత్యాల, జూలై 22 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా లోని గంగపుత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ తల్లి  బోనాల పండుగలో పాల్గోని మహిళలతో  మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్  కలిసి బోనం ఎత్తి  ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వారితో కౌన్సిలర్స్ సిరికొండ పద్మ సింగరావ్, కుసరి అనిల్, కోర గంగమల్లు గంగపుత్ర సంఘ కుల బందవులు యువకులు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు