బిల్లుపాడులో వైభవపేతంగా రాములోరి కళ్యాణం..

Published: Monday April 11, 2022
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..
తల్లాడ, ఏప్రిల్ 10  (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండల పరిధిలోని బిల్లుపాడు గ్రామంలో ఉన్న శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణం ఆదివారం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై వీక్షించారు. తొలుత ఆలయంలో ఏర్పాటుచేసిన భక్తుల సత్రాన్ని, స్వామివారి ధ్వజస్తంభ తొడుగును, రాయల వెంకటేశ్వరరావు, రామకృష్ణవేణి దంపతులు అందించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు జక్కంపూడి వీరభద్రరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో గ్రామస్తులు అన్నదానానికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను జక్కంపూడి వీరభద్రరావు దంపతులు శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, వైరా మార్కెట్ ఉపాధ్యక్షులు దూపాటి భద్రరాజు, ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, ఇంజం కృష్ణార్జునరావు, సత్రం దాతలు జక్కంపూడి నాగేశ్వరరావు, వేముల రాంబాబు, మేడా మోహన్ రావు, సాయినేని రామకృష్ణ, రాయల వెంకటేశ్వరరావు, రామ కృష్ణ వేణి, దమ్మాలపాటి సత్యనారాయణ, రాయల శ్రీనివాసరావు మేడ నరసింహారావు, నల్లమోతు సత్యనారాయణ, కుటుంబరావు, రవి, గ్రామపెద్దలు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.