పేదల బస్తీల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం : కార్పొరేటర్ హామీద్ పటేల్

Published: Thursday March 18, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : పేదలు నివాసముండే బస్తీల్లో ఉచితంగా వైద్య సేవలు అభినందించ దగ్గ విషయమని కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హామీద్ పటేల్ అన్నారు. బుధవారం రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలోని బెరయ గాస్పెల్ చర్చిలో హ్యాండ్ ఆఫ్ హాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యాథిగా హాజరై ప్రారంభించిన అనంతరం అన్ని పరీక్షలు చేసుకున్నారు. నిర్వాహుకులను ఉద్ద్యేశించి హామీద్ పటేల్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు అందజేస్తున్న నిర్వాహకులు చాలా మంచి కార్యక్రమం చేపట్టారాని కితాబిచ్చారు. ఆధునిక మొబైల్ వాహనంలో ఎక్సరే, ఈసిజి, వంటి పరిక్షలతో పాటు, బిపి, షుగర్, దంత పరీక్షలు, నేత్ర పరీక్షలు ఇలా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు సైతం అందజేయడం గొప్ప విషయం అని అభిప్రాయపడ్డారు. వెంటనే రిపోర్టులు కూడా అందజేసి అందుకు సంబంధించిన మందులను కూడా సరఫరా చేశారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో ఇలా ఉచిత శిబిరాలు నిర్వహించిన నిర్వాహకులు, మరిన్ని పేదల బస్తీల్లోనూ నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాలను కాపాడుకోవాలని నిర్వాహకులు జెర్మయ, జీవరాజ్, కెన్నడీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, వార్డ్ మెంబర్ నిర్మల, కె. మధు ముదిరాజ్, దీపక్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు బాబు రావు, ప్రభుదాస్, కమలాకర్, ఫ్రాన్సిస్, ఫిలిప్, రూథ్ తదితరులు పాల్గొన్నారు.