ఆరో రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు

Published: Monday March 01, 2021

అశ్వారావుపేట ఫిబ్రవరి 28 ప్రజాపాలన; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామం లో పద్ధం నాగమణి అంగన్వాడీ టీచర్ గా సేవలందిస్తూ కరోన కష్టకాలంలో కూడా తన వంతు దేశానికి సేవలందించి. గవర్నమెంటు ఆదేశాల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని. అస్వస్థకు గురైన. అది వికటించి మరణించడం జరిగింది. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని, ఆమెకు 50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి గవర్నమెంటు ఉద్యోగం, మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని MRPS ఆధ్వర్యంలో వినాయకపురం గవర్నమెంట్ హాస్పిటల్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండలం. మద్దతుగా MRPS జిల్లా ఉపాధ్యక్షులు రాయల పుల్లారావు, సేర్వోజిల్లా కార్యదర్శి కొవ్వలి వినోద్ కుమార్, MRPS. నాయకులు కోట కనకారావు, మాజీ మండల అధ్యక్షుడు నార్లపాటి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి కోలేటి పకీరయ్య, మండల అధ్యక్షుడు నార్లపాటి సుబ్బారావు,పద్ధం శ్రీనివాస రావు కుటుంబ సభ్యులుపాల్గొన్నారు.