ఫీల్డ్ పేరు మీద కాలయాపన చేస్తున్న ఇరిగేషన్ డీ ఈ సమస్యల కొరకు వచ్చి వెనుదిరుగుతున్న రైతన్నల

Published: Wednesday June 29, 2022
బోనకల్,జూన్ 28 ప్రజాపాలన ప్రతినిధి: ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పనులు ఉన్నప్పుడు వాటిని తీర్చాల్సిన ఇరిగేషన్ అధికారి అవేమీ పట్టించుకోకుండా అడిగే నాథుడే లేడని,ఫీల్డ్‌ పేరు చెప్పి ఆఫీస్‌కు రాకుండా కాలం వెల్లదీస్తున్న సంఘటనలు మండల కేంద్రంలోచోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు ఇరిగేషన్ అధికారినీ పలు సమస్యల కోసం కలిసేందుకు వస్తె వారు కలిసే పరిస్థితి లేదనీ అసలు ఆఫీస్‌ కి సరిగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని నీటిపారుదల విభాగం సబ్ డివిజన్‌ ఆఫీస్‌ లో బాధ్యతగల ఆఫీసర్‌ ఎప్పుడూ కూడా ఆఫీసుకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారి ఫీల్డ్‌ పేరుతో ఆఫీసుకు రావడం లేదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరైనా ఆఫీస్‌ కి అవసరం మీద వస్తే అధికారి ఫోను సైతం లిఫ్ట్‌ చేయడం లేదని,ఒక్కోసారి ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంటడనే ఆరోపణలున్నాయి.ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి సమయానుకూలంగా ఆఫీస్‌ కు వచ్చేలా,ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
 
డీ ఈ వివరణ.....
ఇదే విషయంపై నీటి పారుదల శాఖ డిఈని వివరణ కోరే ప్రయత్నం చేసేందుకు ఆఫీస్ కి వెళ్ళగా ఆయన ఆఫీసులో లేరని ఫీల్డ్ కి వెళ్లారని ఆఫీస్ సిబ్బంది తెలియజేశారు.కనీసం ఆయన ఏ ఫీల్డ్ కు వెళ్లారనే సమచారం కూడా తెలియదనీ వారు సమచారం తెలియజేశారు.అదే సమయంలొ ఫోన్ చేసినా మాత్రం అందుబాటులోకి రాలేదు,ఒక గంట సమయం తరువాత ఫోన్ ద్వార మాట్లాడిన డీఈ మాటలు వింటే నివ్వెరపోవాల్సిందే అన్ని శాఖల్లో అవినీతి జరుగుతుందని,పాలు కల్తీ కావడం లేదా అని హాస్యాస్పదంగా మాట్లాడటం జరిగింది. ఇకనైనా ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.
 
 
 
Attachments area