చెట్లతోనే మనుగడ

Published: Monday July 19, 2021

హరితహారంలో రాష్ట్రం దేశానికే స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, జులై 18, ప్రజాపాలన ప్రతినిధి : చెట్లతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామంలో "ఎవెన్యూ ప్లాంటేషన్" లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా  పాల్గొని స్థానిక నేతలతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 230 కోట్ల మొక్కలు నాటి 33 శాతం హరిత తెలంగాణను సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ కార్యక్రమాని చేపట్టారని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధన కొరకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో 15 ఫీట్ల పొడవుగాల 600 మొక్కలను జిన్నారం గ్రామ పంచాయతీకి అందజేసినందుకుగాను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, ఎంపీటీసీ లావణ్య నరేష్, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, ఉప సర్పంచ్ సంజీవ, సర్పంచులు ఆంజనేయులు, జనార్దన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, మంద రమేష్, నర్సింహ రెడ్డి, సి.హెచ్ వెంకటేష్, మోహన్, కొరబోయిన యాదయ్య, నర్సింగ్ రావు, వెంకటేష్ యాదవ్, మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు