ఆకట్టుకున్న కవి సమ్మేళనం ** గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ రావు

Published: Friday November 18, 2022

 

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : జాతీయోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల, పాత్ర వెలకట్టలేనిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. బుధవారం జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కవులు సామాజిక రుగ్మతల్ని పోగొట్టేలా కవితలు రాయాలన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి సూచనలు అందించాలని కోరారు. వచ్చే ఏడాదిలోగా రూ 1.5 పోట్లతో నూతన గ్రంథాలయ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కవి సమ్మేళనంలో కవుల కవితల్ని ప్రశంసించారు.ఈ సమావేశంలో అవధాని మడుపుల సత్యనారాయణ మూర్తి, ఆసిఫాబాద్ కవుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమాచార్యులు, రాధాకృష్ణ చారి, వ్యవస్థాపకులు నల్గొండ రమేష్ చారి, గౌరవ సలహాదారులు డి వెంకటేశ్వర్లు, కవులు శ్రీరాం సత్యనారాయణ, ఢిల్లీ విజయ్ కుమార్, పూర్ణచందర్ రావు వైద్య, పెంటయ్య, రేవతి, జ్యోతి, పాల్గొని, తమ కవితలతో ఆలదించారు.